అనంతపురం నగర పరిధిలోని రుద్రంపేట వద్ద ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో భాష అనే ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోకు సంబంధించి బాడుగ విషయంలో ఘర్షణ చోటు చేసుకోగా ఒక్కసారిగా భాష అనే ఆటో డ్రైవర్ పై మరో ఆటో డ్రైవర్ దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.