ఆందోల్ నియోజకవర్గం వట్పల్లి మండలంలోని దేవునూర్ ఎస్సీ వసతి గృహాన్ని మంగళవారం సాయంత్రం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా వసతి గృహంలో సౌకర్యాలు వంటగది స్టోర్ రికార్డులను పరిశీలించారు . మెనూ ప్రకారం వండిన భోజనాన్ని రుచి చూసి విద్యార్థులతో మాట్లాడి వారికి సమస్యలను అడిగి తెలుసుకున్నారు .వార్డెన్ ఇతర సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.