రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను శనివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణం లేని సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూరవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు ఎదిగారని ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.