ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసి స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ లంబాడీలు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసులకు చెందాల్సిన అవకాశాలను లంబాడీలు తీసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. తమ హక్కులను లంబాడీలు దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.