గుత్తి పట్టణానికి చెందిన రామలక్ష్మి అనే మహిళ గురువారం రాత్రి వ్యాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.