మనిషి దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈత ఎంతో ఉపయోగం. వేసవికాలంలో ఎండ తీవ్రత తగ్గించుకోవడానికి గ్రామీణ ప్రాంతంలో యువత వ్యవసాయ భావులను ఆశ్రయిస్తుంటారు. ఐరాల మండలం పొలకల పంచాయతీ పి. రెడ్డివారి పల్లి సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో యువతి యువకులు సరదాగా ఉపశమనం పొందుతున్నారు. మండుతున్న ఎండలతో అల్లాడుతున్న గ్రామీణ ప్రజానీకం ఎలాంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ వ్యవసాయ బావులే ఆధారంగా ఈతకు ఉపక్రమించడం పల్లెల్లో ఆనవాయితీ. చిన్న పెద్ద తారతమ్యభేదం లేకుండా ఈత ఆడుతూ ఆహ్లాదకరంగా, ఉత్సాహపరితంగా ఈ క్రీడను ఆస్వాదించడం గ్రామీణ ప్రజలకు నిరంతర ప్రక్రియ.