మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలోని సత్య సాయి నగర్ కు చెందిన ముగ్గురు యువకులు అదే కాలనీలో తండ్రీ, కూతుర్లపై దాడి చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సత్య సాయి నగర్ కు చెందిన అక్షయ్ కుమార్ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఉండేవాడనీ, బాధితురాలు గత ఏడాది నిందితునిపై ఫిర్యాదు చేయగా పోలీసులు అక్షయ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. యువతిని బెదిరింపులకు గురి చేయగా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.