అధికారుల తప్పిదంతో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి బిల్లు ఆగిపోయిందని బాధితుడు ఏటూరునాగారం MPDO కార్యాలయంలో అధికారులతో గురువారం మధ్యాహ్నం వాగ్వివాదానికి దిగాడు. ఆకులవారి ఘనపురం కు చెందిన యాకూబ్ పాషా తన పేరుపై ఇందిరమ్మ ఇల్లు రాగా, రూ.2 లక్షలు అప్పు చేసి పునాది వరకు నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో ఇంటి పట్టాను తన భార్య పేరుపై మార్చాలని చెప్పగా తాను మార్చాడు. దీంతో అధికారులు తప్పుగా పేరు నమోదు చేయడంతో బిల్లు ఆగిపోయిందని వాపోయాడు.