ఆర్యవైశ్య సభ ఎన్నికలపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చిందని న్యాయవాది నాగ రాజేష్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు పట్టణం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సభ 2025 -- 28 సంవత్సరం నూతన కార్యవర్గ ఎన్నికకు సంబంధించి అవకతవకలు జరిగాయని జిల్లా కోర్టుకు వెళ్లామని తెలిపారు. ఈ మేరకు నూతన కార్యవర్గం ఎక్కడా అధికారికంగా ప్రకటించుకోరాదని తీర్పు చెప్పిందన్నారు. అలాగే 24 వర్గాలలో ఏ వర్గంలోనూ కొత్త సభ్యులను, ఓటర్లను చేర్చరాదన్నారు. ఆడిటర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదుల వర్గంలో ఫేక్ ఓటర్లు వున్నారని కోర్టు దృష్టికి తేవడంతో ఆ వర్గానికి