ఈనెల 1న రాజంపేట మండలం బోయినపల్లి లో జరిగిన ముఖ్యమంత్రివర్యులు పర్యటనలో భాగంగా అనారోగ్య పింఛన్ అందుకున్న సుమిత్రమ్మ భర్తకు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన హామీని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి నెరవేర్చారు.సోమవారం ముఖ్యమంత్రివర్యులు జిల్లా పర్యటనలో భాగంగా రాజంపేట మండలం పెద్దకారంపల్లి గ్రామ పంచాయితీ ములక్కాయ పల్లి లో నివాసముంటున్న సుమిత్రమ్మ ముఖ్యమంత్రివర్యుల చేతులమీదుగా అనారోగ్య పింఛన్ 15000 రూపాయలను అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు.... సుమిత్రమ్మ భర్త వెంకటేశ్వర రాజు తో మాట్లాడినప్పుడు తాను పాత ఆటోను నడుపుకుంటున్నానని