ఉమ్మడి నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన రైతులు రవి, ప్రసాద్ కలిసి 10 ఎకరాల్లో వేరు శనగ పంట వేశారు. దాదాపు రూ.5 లక్షలు ఖర్చు చేశారు. అయితే నిన్న కురిసిన వర్షానికి పంట మొత్తం నీటమునిగింది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని గురువారం సాయంత్రం ఆవేదన వ్యక్తం చేశారు.bతమకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు.