మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో పెద్ద శంకరం పేట పట్టణంలో ఆరుగురు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. పరిస్థితిని అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి, పెద్ద శంకరంపేట ఎస్సీ ప్రవీణ్ రెడ్డి పరిశీలించారు.