శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో చిన్నపిల్లలు కూడా మద్యం సేవిస్తున్నట్లు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని, పిల్లల తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలపై నిఘా ఉంచాలని కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పిల్లల ప్రవర్తనను బట్టి ఉపాధ్యాయులు గుర్తించి తల్లిదండ్రులకు గాని పోలీసులకు గాని తెలియజేయాలన్నారు. విద్యార్థులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న సమాచారం తెలియజేయాలని అన్నారు.