మత్స్యకారులు చేపలు పట్టే పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ASF మండలం అడ గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ సౌజన్యంతో మత్స్యకారులకు బోటు, వలలు, టార్చ్ లైట్ లు,ఇతర పరికరాలను పంపిణీ చేశారు. మత్స్యకారులకు అందిస్తున్న ఐరన్, ధర్మకోల్, ప్లాస్టిక్ బోట్లు, వలలు, టార్చ్ లైట్ లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విజయ వాహిని, చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ వారు చేపలు పట్టే వారికి అత్యాధునిక పరికరాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.