ఆటో ఢీకొని స్కూటరిస్ట్ మృతి రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామం మెయిన్ రోడ్డు వద్ద ఆదివారం బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలకు చెందిన కనపర్తి సనత్ కుమార్ (33) తిరుపతిలోని ఓ మెడికల్ షాప్ లో పనిచేస్తున్నాడు. ఆదివారం అతని స్నేహితుడు బాబావల్లితో కలిసి సొంత పనిమీద తిరుపతి నుండి కరకంబాడి వైపు వెళ్తుండగా ఆటో అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఇరువురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఎస్ వి ఆర్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ సనత్ కుమార్ సోమవారం మృతి చెందాడు.