నంద్యాల జిల్లా డోన్లోని మున్సిపల్ కార్యాలయాన్ని రీజినల్ డైరెక్టర్ నాగరాజు బుధవారం తనిఖీ చేశారు. కౌన్సిలర్ దినేష్ గౌడ్ సస్పెన్షన్, స్విమ్మింగ్ పూల్కు తాళాలు వేసిన అంశం, లీగల్ అడ్వైజర్ నియామకం తదితర ఫిర్యాదులపై విచారణ చేపట్టినట్లు సమాచారం. మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు, నిధుల వినియోగం తదితర విషయాలపై అధికారులను అడిగి వివరాలు పొందారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో చురుకుగా పని చేయాలని సిబ్బందిని ఆదేశించారు.