అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. విభిన్న ప్రతిభా వంతుల నుండి కలెక్టర్ స్వయంగా బయటకు వెళ్లి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను కలెక్టర్ కు వివరించారు.