ఆగస్టు నెల 23 న 4వ శనివారం. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్చాంద్రా కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, వర్చువల్ గా జిల్లా కలెక్టర్ల తో సమావేశమై ఎంఐ ట్యాంకులు & గ్రౌండ్ వాటర్, సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్‌లోడ్, స్వామిత్వ కార్యక్రమం, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులపై సూచనలు, పలు విషయాలను చర్చించారు