నిషేధిత మత్తు పదార్థాలు రవాణా చేసిన అమ్మకాలు జరిపిన కఠిన చర్యలు తప్పవని బొమ్మూరు ఎస్సై రాజులపాటి అంకారావు హెచ్చరిక జారీ చేశారు . విశ్వాసనీయ సమాచారం లో రాజమండ్రి రూరల్ హుకుంపేటలో స్వాధాలు నిర్వహించగా ఉక్కంపాడుకు చెందిన అమన్ పాండే, ( 23), విశాఖపట్నం కి చెందిన మండపాటి తేజస్వి వర్మ,( 26 ) పట్టుకుని, వారి వద్ద నుండి సుమారు 18 గ్రాముల మెత్ డ్రగ్ (Meth, క్రిస్టల్ పౌడర్ రూపంలో) విలువ రూ.90,000/-, క్యాష్ రూ.1,07,720/-, రెండు మొబైల్ ఫోన్లు, బ్యాగ్ స్వాధీనం చేసుకున్నామని గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు .