ఈనెల 21న మిస్టర్ ఆంధ్ర పోటీలకు తరలి రండి అని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మతిన్ అహ్మద్ కోరారు. ఈనెల 21న భీమవరం లో మిస్టర్ ఆంధ్ర స్టేట్ లెవెల్ బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని ప్రాంతాల వారు భీమవరం లో జరిగే కంపిటీషన్ లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలిచి కర్నూలు జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని కోరారు.