పుత్తూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌గా హెచ్.మహేంద్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు.మహేంద్ర గతంలోనే పుత్తూరు ఆర్టీసీ డిపోలో మెకానికల్ ఫోర్‌మెన్‌గా 4 సంవత్సరాలు పనిచేసి, ఉద్యోగుల మనసులు గెలుచుకున్నారు. అనంతరం తిరుపతి డివిజన్‌లో వివిధ విభాగాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.