షాద్నగర్ లోని మండల పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం మధ్యాహ్నం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు వర్గాల బలమైన శక్తిగా పోరాట యోధురాలుగా చాకలి ఐలమ్మ చరిత్ర చిరస్మనీయమని అన్నారు. చాకలి ఐలమ్మ లాంటి నిస్వార్థ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపిన యోధురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.