బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తాండూర్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు శనివారం తాండూర్ పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తెలంగాణ మైనార్టీ బాలికల స్కూలు కాలేజీలో తాండూర్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు