కొడవలూరు మండలం ఎల్లాయపాలెంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శ్రీకారం చుట్టారు. తొలుత టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు సమపాలనలో జరుగుతున్నాయని తెలిపారు.