శనివారం వనపర్తి జిల్లా లో పర్యటించిన సమాచార హక్కు చట్టం కమిషనర్లు పివి శ్రీనివాస్ అయోధ్య రెడ్డి వైష్ణవి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయోధ్య రెడ్డి మాట్లాడుతూ జిల్లాలలోని పెండింగ్ కేసులను ఎక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టడానికి జిల్లాల పర్యటన ముంబరంగ చేపడుతున్నామని అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నామని ప్రజలకు పారదర్శకమైనటువంటి పాలన మరియు విశ్వాసం కలిగించడానికి సమాచార హక్కు చట్టం కృషి చేస్తుందన్నారు.