ముంజలూరు గ్రామంలో వ్యవసాయ రంగంలో పెరుగుతున్న సాంకేతికత రైతులకు మేలు చేస్తోంది. యంత్ర పరికరాల వాడకంతో శ్రమ, ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. ఈ క్రమంలో, ముంజలూరు గ్రామానికి చెందిన రైతు బాలాజీ తన పంటకు డ్రోన్ సాయంతో పురుగుమందు పిచికారీ చేశారు. డ్రోన్తో ఎకరాకు కేవలం రూ.250 నుంచి రూ.300 వరకు ఖర్చు అవుతుందని, శారీరక శ్రమ కూడా గణనీయంగా తగ్గుతుందని ఆయన తెలిపారు.