Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో పఠాన్ రఫీఖాన్ అధ్యక్షతన “పంచాయతీ పురోభివృద్ధి" అంశంపై పలు సూచనలు చేశారు. 2023-24లో పంచాయతీల సామాజిక, ఆర్థిక అభివృద్ధి పనితీరును సమీక్షించి ప్రణాళిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.