పెండింగ్లో ఉన్న కేసుల్లో నిందితులకు శిక్షలు పడేందుకు పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఏలూరు జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందికి అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు సూచించారు. ప్రతి శనివారం నిర్వహించే కోర్టు మానిటరింగ్ సెల్ రివ్యూ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇప్పటి వరకు సాధించిన పురోగతిపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.