కర్నూలు నగరంలో విస్తృత హరితీకరణ కార్యక్రమం భాగంగా వేలాది మొక్కలను నాటుతున్నామని, దీనికి ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల సహకరించాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ కోరారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నగరాన్ని పచ్చగా తీర్చిదిద్దేందుకు ప్రతి వాడ, ప్రతి కాలనీ, ప్రతి సంస్థ నుంచి చురుకైన భాగస్వామ్యం అవసరం ఉందన్నారు. జూన్ మాసం నుండి పదివేల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. అశోక్ నగర్ పంప్‌హౌస్ నందు కానుగ, సితాఫల్, బాదం, వేప, రెయిన్ ట్రీ, తదితర మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థల