ఆదోని జిల్లా ఏర్పాటుకు సహకరించాలని, బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ను ఎమ్మెల్యే పార్థసారథి కోరారు. ఇవాళ అనంతపురంలో జరుగుతున్న 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' విజయోత్సవ సభకు విచ్చేసిన వారికి రాతపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. మండలాల విభజనలో భాగంగా ఆదోనిని 4 మండలాలుగా విభజించి, ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.