టెక్కలిలోని ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద సోమవారం ఉదయం నుంచి రైతులు పడిగాపులు పడ్డారు. టెక్కలి పరిసర ప్రాంతాలు నుంచి వచ్చిన పలువురు రైతులు మాట్లాడుతూ. క్యూ లైన్లో గంటలు తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఎరువుల దుకాణాల్లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నారని, యూరియాతో పాటు జింక్, గుళికలు కచ్చితంగా కొనాలని చెబుతున్నారని వారి గోడును చెప్పారు.