భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతిని ఘనంగా నిర్వహించినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు తెలిపారు.ఈ క్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బందు సాయిలు మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి పేద ప్రజలు, అనగారిన వర్గాల ప్రజల సమస్యల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలన్నారు బందు సాయిలు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.