కూటమీ ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నదని వైఎస్ఆర్సిపి చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ ఎంసీ విజయానంద రెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని 44వ డివిజన్లో రీ కాలింగ్ చంద్రబాబు వార్డ్ ఇంచార్జి అల్తాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం సి విజయానంద రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ముఖ్యంగా తల్లికి వందనం అర్హులైన వారికి ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఉచిత గ్యాస్ సిలిండర్, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి 18 వేల రూపాయల ఇస్తామని మోసం