నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేట్ 33/11 కేవీ సబ్స్టేషన్ మరమ్మత్తుల దృష్ట్యా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టెక్నికల్ డీఈ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. అగ్రికల్చర్ మార్కెట్ ఏరియా, మోచిగల్లి, బుధవార్ పేట్, గాంధీచౌక్, నాయుడువాడ, రామ్ రావు బాగ్, సాయిబాబా గుడి, విశ్వనాథ్ పేట్, వైయస్సార్ నగర్, గాజులపేట్, డాక్టర్స్ లైన్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు విద్యుత్తు ఉండదని పేర్కొన్నారు. ఆయా కాలనీలకు చెందిన వినియోగదారులు సహకరించాలని కోరారు.