తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం ఉదయం వందే భారత్ రైలు ఢీకొని వృద్ధురాలు మృతి చెందినది. తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు కంటి ఆసుపత్రికి వచ్చినట్లు ఆమె సమాచారం. నిడదవోలులో రైలు పట్టాలు దాడుతుండగా ట్రైన్ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆమె వయసు 65 సంవత్సరాలు ఉంటుందని వివరాలు సేకరిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.