నల్లగొండ జిల్లాలోని ఆదివారం రాత్రి చంద్రగ్రహణం సమయంలో రోలులో రోకలి నిలబడుతుందని పూర్వీకుల నమ్మకాన్ని రుజువు చేసేందుకు నల్లగొండ జిల్లా గుర్రంపొడు లోని కొందరు స్థానికులు ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగంలో రోకలి విజయవంతంగా నిలబడడంతో ప్రజలు ఆశ్చర్యపరిచింది.ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో సోమవారం వైరల్ గా మారింది అయితే రోకల్ని దాని గురుత్వాకర్షణ కేంద్రం వద్ద సమతుల్యం చేయడం ద్వారా ఏ సమయంలోనైనా నిలబెట్టవచ్చని జన విజ్ఞాన వేదిక సభ్యులు పలువురు తెలుపగా ఇది గ్రహణం ప్రభావం కాదన్నారు.గ్రామ సమయంలోనే రోకలి నిలబడుతుందని, పలువురు వాదనను సామాజిక మాధ్యమాలలో చర్చించుకుంటున్నారు.