వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించాలి - జుక్కల్ SFI నాయకులు జుక్కల్ వెనుక బడిన ప్రాంతమని ఇక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వృత్తివిద్యా కోర్సులను ప్రారంభించాలని SFI నాయకులు అన్నారు. శుక్రవారం జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా SFI మండల అధ్యక్షులు షేక్ ఫిర్దొస్ మాట్లాడుతూ జుక్కల్ మండలం వెనుకబడ్డ ప్రాంతమని ఇక్కడ పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యనభ్యసిస్తారని అన్నారు. ఈ కాలేజ్ లో వోకేషనల్ కోర్సులు ప్రవేశ పెడితే విద్యార్దులకు త్వరగా ఉపాధి లభిస్తుందని అన్నారు.కార్యక్రమంలో నాయకులు ఇస్మాయిల్, కరణ్, చౌహాన్ ఉన్నారు...