కొత్తపేట డివిజన్ బాలాజీ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 6లో డ్రైనేజ్ నీళ్లు త్రాగు నీరు బోరు బావి నీటిలో కలుస్తున్నాయని స్థానికులు తెలియజేయడంతో వెంటనే స్థానిక కార్పొరేటర్ పవన్ కుమార్ అక్కడికి వెళ్లి సమస్యను పరిశీలించారు. డ్రైనేజ్ నీళ్లు త్రాగు నీటిలో కలుస్తుందటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు తెలియజేశారు. వెంటనే కార్పొరేటర్ సమస్యను పరిశీలించి సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడి తక్షణమే మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీలో అపార్ట్మెంట్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు తెలియజేశారు.