నాగలాపురంలో ప్రమాదం నాగలాపురం పంచాయతీ తూర్పు దళితవాడలో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. వేంబాకానికి చెందిన ఉమాపతి నాగలాపురం నుంచి ఇంటికి బయల్దేరాడు. ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఉమాపతి తలకు తీవ్ర గాయమూంది. కాలనీ వాసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.