కోఠిలోని వైద్య సంచాలకుల కార్యాలయం ముందు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది 1254 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదని వారు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆలోపు ఆర్డర్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. త్వరగా ఆర్డర్స్ ఇవ్వాలని ఆఫీసును ముట్టడించడంతో పోలీసులకు వారికి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు.