బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో హైడ్రాక్ కమిషనర్ ఏవి రంగనాథ్ శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలకు మరింత క్లారిటీ రావాలని అన్నారు. వందేళ్ళ ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్ళబోతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం నగరంలో 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు. అన్ని ఆధారాలతోనే ఎఫ్టిఎల్ మార్పు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదని అన్నారు.