Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాల 35వ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Bhimavaram, West Godavari | Sep 10, 2025
భీమవరం డిఎన్ఆర్ కళాశాల శ్రీ రామకృష్ణ సభ భవన్‌లో జరిగిన శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాల 35వ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మధ్యాహ్నం మూడున్నరకు మాట్లాడుతూ బధిరులు చదువుతోనే జీవితంలో స్థిరపడగలరని, చదువుకోకపోవడమే నిజమైన వైకల్యమని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 1985లో ఏర్పాటైన ఈ పాఠశాలలో ప్రస్తుతం 75 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. జిల్లాలో బధిర పిల్లలను గుర్తించి ఈ పాఠశాలలో చేరేలా ప్రోత్సహించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us