అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న సైడ్ కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. డ్రైవర్ నిద్ర మత్తె ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.