ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెబ్బెన మండలంలోని నంబాల లోలెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లోని పంటపొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.