మాజీ ఎంపీ తలారి రంగయ్య పై కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ధ్వజమెత్తాడు. ఐదేళ్ల ఎంపీగా పనిచేసిన తలారి రంగయ్య ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదని ఆరోపించారు. కంబదూరు మండలం కూరాకులపల్లిలో సోమవారం సీఎంగా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంగయ్య ఒక్క ప్రజా సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు. రంగయ్య అబద్ధాలు చెప్పడంలో దిట్ట అన్నారు.