గత ఐదు రోజుల నుండి కాగజ్ నగర్ పట్టణంలో జీవో నెంబర్ 49 రద్దు పోడు భూముల సమస్యకై నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నిరాహార దీక్షను భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డిలు నిమ్మరసం అందించి దీక్షను విరమింప చేశారు. జీవో నెంబర్ 49 పై అసెంబ్లీలో పోరాటం చేస్తామని పోడు భూములకు సమస్యల కోసం తాము ముందుండి పోరాడుతామని శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు,