బోటులో ప్రయాణించిన కలెక్టర్,సీపీ... కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువులో గణేష్ నిమజ్జనాన్ని కలెక్టర్,సీపీ పర్యవేక్షించారు.అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దంపతులు మరియు సీపీ,కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి చెరువులో గణేష్ నిమజ్జనం చేసారు. అనంతరం బోటింగ్ చేస్తూ చెరువు పరిసరాలను పరిశీలించారు. నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు.