చివరి భూములకు నీరు అందించాలని రైతు సంఘం ధర్నా తల్లాడ స్థానిక మండల కేంద్రంలోని తెలంగాణ రైతు సంఘం తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో సాగునీటి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ మాట్లాడుతూ మండలంలోని పినపాక రెవిన్యూ పరిధిలో వైరా ప్రాజెక్టు నాలుగవ నంబరు కాలువలో ఉన్న చెత్తను పూడికను తొలగించి చివరి భూముల వరకు నీరు అందించి పంటలను కాపాడాలని అన్నారు రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఒకవైపు యూరియా కొరత మరోవైపు ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్న సరైన ప్రణాళిక లేని కారణంగా కాలువలను ఖరీఫ్ సీజన్ కు ముందే రిపేర్లు చేపించాలి