వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిర్వహించిన అన్నదాత పోరుపై టీడీపీకి ఎందుకు అంతా భయం అని నంద్యాల జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. గురువారం కల్లూరులో ఆయన మాట్లాడుతూ అన్నదాత పోరుపై కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. యూరియా కొరతపై రూ.250 కోట్ల స్కాం జరిగిందని, ఒక్కో బస్తాపై రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ లేవని పేర్కొన్నారు.