కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో వినాయక ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణ నేపథ్యంలో శనివారం రాత్రి అదనపు బలగాలు మోహరించాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపి తిలక్ 24 గంటలు సమస్యలు పరిష్కరించుతామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా కట్టుదట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు గ్రామంలో ఎటువంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు